బస్సుయాత్ర వాయిదా..చంద్రబాబుకు ఎంపిల షాక్

బస్సుయాత్ర వాయిదా..చంద్రబాబుకు ఎంపిల షాక్

వినటానికే విచిత్రంగా ఉన్న టిడిపి ఎంపిలే చంద్రబాబుకు షాకిచ్చారు. ప్రత్యేక హోదాపై పోరాటం ఉధృతం చేయాలనుకున్న చంద్రబాబు నాయుడుకు ఎదురుదెబ్బ తగిలింది.

బస్సుయాత్ర విషయంలో తెలుగుదేశం ఎంపీలు సుముఖంగా కనిపించలేదు.  హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకూ ఉద్యమాన్ని ముమ్మరం చేస్తుండటంతో అప్రమత్తమైన చంద్రబాబు ఆ పార్టీకి పోటీగా కార్యక్రమాలు రూపొందించాలనుకున్నారు.

టీడీపీ ఎంపీలతో రాష్ట్రంలో బస్సు యాత్ర చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.

ఈ యాత్రకు సంబంధించి రూట్‌ మ్యాప్‌పై చర్చించేందుకే ఢిల్లీలో ఉన్న ఎంపీలందరూ అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఎంపీల బస్సు యాత్ర ద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలనుకున్నారు.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్రపై నుంచి జనం దృష్టి మరల్చడానికి చంద్రబాబు వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. అయితే అధినేత ప్రతిపాదించిన బస్సు యాత్రకు ఎంపీలు సముఖంగా లేకపోవండంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది.

ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎంపీలతో జరగాల్సిన సమావేశం కూడా నిర్వహించడం లేదని తెలుస్తోంది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos