Asianet News TeluguAsianet News Telugu

విదేశీ సాయం పంపిణీలో అడ్డంకులు.. దృష్టి సారించండి: మోడీకి ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ

ప్రధాని నరేంద్రమోడీకి టీడీపీ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రధాని మోడీకి లేఖ రాశారు. విదేశీ సహాయాన్ని పంపిణీ చేయడంలో గందరగోళం నెలకొందన్నారు. పరికరాల పంపిణీలో అడ్డంకులు తొలగించాలని రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు.

tdp mp rammohan naidu letter to pm narendra modi over foreign aid distribution ksp
Author
Amaravathi, First Published May 9, 2021, 7:47 PM IST

ప్రధాని నరేంద్రమోడీకి టీడీపీ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రధాని మోడీకి లేఖ రాశారు. విదేశీ సహాయాన్ని పంపిణీ చేయడంలో గందరగోళం నెలకొందన్నారు. పరికరాల పంపిణీలో అడ్డంకులు తొలగించాలని రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు.

పరికరాల పంపిణీ అనుమతులకు నోడల్ అధికారులను నియమించాలని ఆయన సూచించారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల వంటి పరికరాలపై... జీఎస్టీ భారాన్ని వెంటనే తొలగించాలని రామ్మోహన్ నాయుడు కోరారు. 

కాగా, ఇండియాలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజున దేశంలో కరోనా కేసులు 4 లక్షలను దాటాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు 4,03,738కి చేరుకొన్నాయి. కరోనాతో 4,092 మంది చనిపోయారు.దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 2,22,96,414కి చేరుకొన్నాయి.

Also Read:ఇండియాలో కరోనాది అదే జోరు: వరుసగా నాలుగో రోజు 4 లక్షలు దాటిన కరోనా కేసులు

గత 24 గంటల్లో దేశంలో  18,65,428 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 4.03,738 మందికి కరోనా సోకింది. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,42,362కి చేరుకొంది. కరోనా కేసులతో పాటు రికవరీ కేసుల సంఖ్య పెరుగుతోంది. రికవరీ పెరగడం కొంత ఉపశమనంగా కన్పిస్తోంది.

గత 24 గంటల వ్యవధిలో 3,86,444 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 1,83,17,404కి చేరుకొంది.  ప్రస్తుతం దేశంలో 37,36,648 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కరోనా కట్టడి కోసం ఇప్పటివరకు 16,94,39,663 మందికి వ్యాక్సిన్ అందించారు. వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే  డిమాండ్ మేరకు వ్యాక్సిన్  అందుబాటులో ఉండడం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios