ఏడుకొండల వాడిపై షాకింగ్ కామెంట్స్..
కలియుగ దైవం.. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిపై టీడీపీ ఎంపీ మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారిని ‘వెంకన్న చౌదరి’ గా సంబోధించారు. కర్ణాటక ఎన్నికల్లో రకరకాల మతలబులు చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మెజార్టీ రాకపోవడానికి కారణం మా తిరుమల తిరుపతి వెంకన్న చౌదరి అంటూ వ్యాఖ్యానించారు.
రాజమండ్రిలో పార్టీ నేతల సమావేశం సందర్భంగా మురళీమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామని బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆకాశంలో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నా చంద్రుడు మాత్రం ఒక్కడే అనే విషయం గుర్తు పెట్టుకోవాలని మురళీమోహన్ పేర్కొన్నారు.
కాగా.. అందరి దైవం వెంకటేశ్వరస్వామి పేరుకి కులాన్ని ఆపాదించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ పలవురు మురళీ మోహన్ పై విమర్శలు చేస్తున్నారు.
