నాకు దొంగబుద్ధులు లేవు.. అప్పుడు వైఎస్ నిరూపించలేకపోయారు.. జగన్‌కు అర్హత లేదు

tdp mp murali mohan comments on ys jagan
Highlights

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాజమండ్రి, టీడీపీ ఎంపీ మురళీ మోహన్..తనపై జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. 18 నెలలు జైలులో గడిపిన జగన్‌కు, తనపైన ఆరోపణలు చేసే అర్హత లేదన్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాజమండ్రి, టీడీపీ ఎంపీ మురళీ మోహన్..తనపై జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. 18 నెలలు జైలులో గడిపిన జగన్‌కు, తనపైన ఆరోపణలు చేసే అర్హత లేదన్నారు.. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కూడా తనపై అసత్య ఆరోపణలు చేసి నిరూపించలేకపోయారన్నారు. ఆయన తీరు మార్చుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని మురళీ మోహన్ హెచ్చరించారు..

తనకు దొంగ బుద్ధులు లేవని.. ఇసుక దందాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. రాజమండ్రిలో తాను నిర్మించుకున్న ఇంటికి ఇసుకను మార్కెట్ రేటు ప్రకారమే కొనుగోలు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన కోడలు రూప సైతం స్పందించారు.

తెలుగు రాష్ట్రాల్లో తనకు ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిరూపిస్తే.. తనపై ఎలాంటి కేసులు పెట్టినా అభ్యంతరం లేదని ఆమె సవాల్ విసిరారు.. ఇతరులపై ఆరోపణలు చేసేముందు ఆలోచించుకోవాలని.. ఆధారాలుంటేనే ఆరోపణలు చేయాలని జగన్‌కు ఆమె హితవు పలికారు.. తనకు గతంలో రాజమండ్రిలో ప్రభుత్వం స్థలం కేటాయిస్తానని వద్దన్న విషయాన్ని రూప గుర్తు చేశారు... 
 

loader