టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. గత కొంతకాలంగా కేశినేని తాను చెప్పాలనుకునే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ ని టార్గెట్ చేశారు. 

ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదంటూ కేంద్రం తెగేసి చెప్పడంతో సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలపై టీడీపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేశారు. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని ట్విట్టర్‌ వేదికగా సెటైర్లు వేశారు.
 
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ పేర్కొనడంపై కౌంటర్ ఇచ్చారు. ‘‘కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి బడ్జెట్‌లో రూ.21 కోట్లు సాధించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి గారూ.. మీరు, మీ 22 మంది ఎంపీలు చాలా చాలా గ్రేట్ సార్‌’’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు.