అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ... ప్రజా వేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిని టీడీపీ నేతలు తప్పుపడుతున్నా.. అధికార ప్రభుత్వం ఖాతరు చేయలేదు. కాగా... దీనిపై కేశినేని వ్యంగ్యంగా స్పందించారు.

‘ఇంకా నయం... తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది. అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే’... అని నాని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన పోస్టుకి టీడీపీ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.

ప్రజా వేదిక కూల్చడానికి ముందు కూడా కేశినేని నాని జగన్ కి ఓ సూచన చేశారు. ‘‘ ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే, అది ప్రజాధనంతో నిర్మించినటువంటి వేదిక అని ఆయన తెలిపారు. కాబట్టి ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన పిదప, ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బావుంటుందని’’ కేశినేని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.