ఇదొక ఫ్యాబ్రికేటెడ్ కేసు.. ఇందులో పస లేదు, న్యాయమే గెలుస్తుంది : కేశినేని నాని
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం అనేది ఒక పాలసీ డెసిషన్ అన్నారు టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఈ కేసులో పస లేదని, ఇదొక ఫ్యాబ్రికేటెడ్ కేసన్నారు. అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తాయని .. అంతా పాజిటివ్‌గానే వుంటుందని భావిస్తున్నానని నాని చెప్పారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా వాదనలు పూర్తయ్యాయి. దీంతో న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో పస లేదని, ఇదొక ఫ్యాబ్రికేటెడ్ కేసన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం అనేది ఒక పాలసీ డెసిషన్ అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని.. అధికారులు ట్రాన్స్‌ఫర్లు, పోస్టింగుల కోసం ప్రభుత్వం చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని నాని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని కేశినేని నాని స్పష్టం చేశారు. అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తాయని .. అంతా పాజిటివ్‌గానే వుంటుందని భావిస్తున్నానని నాని చెప్పారు.
ALso Read: చంద్రబాబు అరెస్ట్.. ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్.. తీవ్ర ఉత్కంఠ..
కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపిస్తుండగా.. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకకటేశ్వరరావు వాదనలువినిపిస్తున్నారు. అయితే ఇరుపక్షాల వాదనలు వాడివేడిగా సాగాయి.