న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్  జగన్ పై సెటైర్లు వేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గోదావరి జలాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ది ఔదార్యం అన్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. 

మీరు చెప్పింది అక్షరాలా నిజం జగన్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కేసీఆర్ కు అంత ఔదార్యం ఉండబట్టే కదా ఎన్నికలలో మీకు అంత సాయం చేశారంటూ ఆరోపించారు. అందుకు సంబందించి ఒక న్యూస్ పేపర్ క్లిప్ ను పొందుపరిచారు. 

ఇకపోతే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాన సీఎం కేసీఆర్ ది ఔదార్యం అంటూ కితాబిచ్చారు. గోదావరి జలాలు ఇస్తున్నారంటూ ప్రశంసించారు. 

ఏపీ భూభాగం నుంచి కాకుండా తెలంగాణ నుంచే గోదావరి జలాలు వస్తున్నాయని అలాంటి సమయాల్లో సంతోషించాల్సింది పోయి విమర్శలా అంటూ నిప్పులు చెరిగారు. జగన్ వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని నాని ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.