14వ, ఆర్థిక సంఘం ఏనాడూ కూడ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పలేదని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. ఒకవేళ అలా చెప్పినట్టు నిరూపిస్తే తాను ఈ సభలోనే రాజీనామా సమర్పించి వెళ్లనున్నట్టు ఆయన ప్రకటించారు.
న్యూఢిల్లీ: 14వ, ఆర్థిక సంఘం ఏనాడూ కూడ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పలేదని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. ఒకవేళ అలా చెప్పినట్టు నిరూపిస్తే తాను ఈ సభలోనే రాజీనామా సమర్పించి వెళ్లనున్నట్టు ఆయన ప్రకటించారు.
మంగళవారం నాడు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టంపై జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానానికి కౌంటరిచ్చారు.
14వ,ఆర్థిక సంఘం ఏనాడూ కూడ ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఏనాడూ చెప్పలేదన్నారు. అలా చెప్పినట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేసి వెళ్తానని ఆయన సవాల్ విసిరారు.
ఏపీ రాష్ట్రంలో విద్యాసంస్థలు లేవని ఏపీ విభజన హమీ చట్టంలో విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని జీవోలు ఇచ్చారని సీఎం రమేష్ గుర్తుచేశారు. అయితే ఈ విద్యా సంస్థల ఏర్పాటు కోసం రూ.12 వేల కోట్ల విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని ఆయన గుర్తుచేశారు.
కానీ, 4 విద్యాసంస్థల ఏర్పాటు కోసం అవసరమైన రూ.546 కోట్లను కేంద్రం కేటాయించిన విషయాన్ని ఆయన చెప్పారు. ఏపీలో బీజేపీకి ఓట్లు, సీట్లు లేవన్నారు. అందుకే ఏపీలో టీడీపీని ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో నిధులు ఇవ్వలేదన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీకి తాము ఒప్పుకొన్నట్టు ఆయన గుర్తుచేశారు. యూ టర్న్ తాము తీసుకోలేదన్నారు. చంద్రబాబునాయుడును చూసి మోడీ భయపడ్డారని సీఎం రమేష్ విమర్శించారు.
మోడీ కంటే 7 ఏళ్లు ముందుగానే చంద్రబాబునాయుడు సీఎంగా ఎన్నికయ్యారని చెప్పారు. వాజ్‌పేయ్, దేవేగౌడ లాంటి వారిని ప్రధానమంత్రిగా చేసిన ఘనత చంద్రబాబుకు ఉందన్నారు. బాబును చూసి భయపడి ఏపీకి నిధులు ఇవ్వలేదన్నారు. చంద్రబాబుకు మెచ్యూరిటీ లేదనడాన్ని సీఎం రమేష్ తప్పుబట్టారు.
