జగన్ ఎఫెక్ట్: లోక్‌సభలో కాపు కోటాపై గళమెత్తిన ఆవంతి శ్రీనివాస్

TDP MP Avanthi Srinivas demands for Kapu reservations in Lok Sabha
Highlights

కాపుల రిజర్వేషన్ అంశంపై  కేంద్రం నిర్ణయం తీసుకోవాలని  టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై  సోమవారం నాడు టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
 

న్యూఢిల్లీ:కాపుల రిజర్వేషన్ అంశంపై  కేంద్రం నిర్ణయం తీసుకోవాలని  టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై  సోమవారం నాడు టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

కాపుల రిజర్వేషన్ల విషయమై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయాలని  చంద్రబాబునాయుడు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  టీడీపీ ఎంపీలను ఆదేశించారు. సోమవారం నాడు ఉదయం బాబు టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ టెలికాన్పరెన్స్ లో  కాపులకు రిజర్వేషన్ల విషయమై  లోక్‌సభలో ప్రస్తావించాలని కోరారు.  కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏపీ శాసనసభ తీర్మానం చేసిన   విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  ఈ మేరకు షెడ్యూల్ 9లో  ఈ విషయాన్ని చేర్చాలని  ఆయన డిమాండ్ చేశారు.

కాపు రిజర్వేషన్ల  విషయమై ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  ఈ విషయమై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.  కాపుల రిజర్వేషన్ విషయమై బీజేపీ వైఖరిని బయటపెట్టేందుకు  పార్లమెంట్ వేదికగా  టీడీపీ ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
 

loader