టీడీపీ ఎమ్మెల్సీ రౌడీయిజం..

First Published 24, May 2018, 1:18 PM IST
tdp MLc reddy subramanyam abuses ycp mla jaggireddy
Highlights

వైసీపీ ఎమ్మెల్యేపై దాడి

తెలుగుదేశం నేతలు రెచ్చిపోతున్నారు.అదికారం వస్తుందో,రాదో అన్న సందేహమో,లేక మరే కారణమో తెలియదు కాని తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో టిడిపి ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం రౌడీయిజానికి పాల్పడ్డారు.  వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు.

అసలేం జరిగిందంటే.. తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సమావేశం గురువారం రసాభాసగా మారింది. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్సీ, శాసనమండలి వైస్‌ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం జిల్లా పరిషత్‌ సమావేశంలో రెచ్చిపోయారు. వైసీపీ కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గోపాలపురం ఇసుక ర్యాంపు అవినీతిపై రెడ్డి సుబ్రహ్మణ్యంను జెడ్పీ సమావేశం వేదికగా నిలదీశారు.

దీంతో సహనం కోల్పోయిన రెడ్డి సుబ్రహ్మణ్యం దుర్భాషలాడుతూ ఎమ్మెల్యేపై నేమ్‌ ప్లేట్‌, వాటర్‌ బాటిళ్లను విసిరేశారు. ఈ ఘటనతో సమావేశంలో మిగిలిన వారందరూ నిశ్చేష్టులు అయ్యారు. జగ్గిరెడ్డి ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.

కాగా, వివాదంతో చైర్మన్‌ పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేపై దాడికి దిగిన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం తీరును వైఎస్సార్‌ సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

 

loader