ఆ ఎంపీ గ్రామాల్లోకి వస్తే తరిమికొడతారు.....

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 24, Aug 2018, 3:31 PM IST
Tdp mlc rajendraprasad on bjp
Highlights

బీజేపీ అంటే ప్రస్తుతం బ్రోకర్లు, జోకర్ల, పిచ్చోళ్ల పార్టీగా మారిందని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్  అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ ఖండించారు. 

అమరావతి: బీజేపీ అంటే ప్రస్తుతం బ్రోకర్లు, జోకర్ల, పిచ్చోళ్ల పార్టీగా మారిందని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్  అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ ఖండించారు. జీవీఎల్ మా గ్రామాల్లోకి వస్తే తరిమికొడతారంటూ వార్నింగ్ ఇచ్చారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. అమరావతి బాండ్లలో అవినీతి ఎక్కడ జరిగిందంటూ ప్రశ్నించారు. 

పీడీ అకౌంట్లపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాఫెల్, ఎస్సార్ స్కాంలపై బీజేపీ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తమపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు అమరావతికి నిధులు ఎలా తేవాలో చెప్పాలన్నారు. బీజేపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకంటున్నారని మండిపడ్డారు. 

రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతలకు డిపాజిట్లు కూడా రావన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీతో చంద్రబాబు నాయుడు పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ మాత్రం కేసులు మాఫీ కోసం లాలూచీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.  
 

ఈ వార్త కూడా చదవండి

సీఎం చంద్రబాబుకు జీవీఎల్ సవాల్

loader