సీఎం చంద్రబాబుకు జీవీఎల్ సవాల్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 24, Aug 2018, 2:57 PM IST
MP GVL FIRE ON CM CHANDRABABU
Highlights

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు దమ్ముంటే పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సవాల్ విసిరారు. అమరావతి బాండ్ల పేరుతో అవినీతి జరుగుతుందని ఘాటుగా విమర్శించారు. 

ప్రకాశం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు దమ్ముంటే పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సవాల్ విసిరారు. అమరావతి బాండ్ల పేరుతో అవినీతి జరుగుతుందని ఘాటుగా విమర్శించారు. 

రాష్ట్రంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని దుయ్యబుట్టారు. యనమల పంటి చికిత్సకు 3లక్షలు ఖర్చుపెట్టడమే అందుకు ఉదాహరణ అన్నారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పోర్టు ఏర్పాటు కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే అనుమతుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోర్టు ఏర్పాటు వెనక్కి పోతుందన్నారు. 

అలాగే నిమ్జ్‌ కు అనుమతులు వచ్చినా.. పనులు ప్రారంభించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని జీవీఎల్ ఆరోపించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పంచనే నడుస్తోందంటూ విమర్శించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఆ ఎంపీ గ్రామాల్లోకి వస్తే తరిమికొడతారు..... 

loader