Asianet News TeluguAsianet News Telugu

‘ఆంధ్రా యూనివర్శిటీ ఒక దెయ్యాల కొంప’

తెలుగుదేశం మహనాడు పోస్టర్ ను ఆవిష్కరిస్తూ వైజాగ్ లో ఉన్నఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని దెయ్యాల కొంప అని ఈ ఫోటోలో ఉన్న పెద్దమనిషి రగడ సృష్టించారు. ఏయూను ఓ దెయ్యాల కొంప‌గా అభివ‌ర్ణించడమే కాకుండా   దెయ్యాల కొంప‌ను తెలుగుదేశం మహా నా డు  సంబరాలకు అద్దెకివ్వ‌డంలో త‌ప్పేంట‌ని నిల‌దీశారు. 

TDP MLC dubs Andhra University as a haunted place

ఇదిగో ఈ పోటోలో ఉన్న పెద్ద మనిషి పేరు ఎం వివిఎస్ మూర్తి.

 

తెలుగుదేశం హయాంలోరెండు సార్లు లోక్ సభ సభ్యుడయ్యాడు. ఇపుడు ఎంఎల్ సి. ఆయనకు ఉన్న రాజకీయ అర్హత బాగా డబ్బు. తర్వాత ముఖ్యమంత్రి కి ఆత్మీయుడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంనుచి డాక్టరేట్ పొందారు.

 

అయితే, ఆయనతెలుగుదేశం మహనాడు పోస్టర్ ను ఆవిష్కరిస్తూవైజాగ్ లో ఉన్నఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని దెయ్యాల కొంప అన్నారు. ఈ వ్యాఖ్య చాలా కలకలం సృష్టిస్తూ ఉంది.పెద్ద గొడవజరగుతూ ఉంది క్యాంపస్ లో.

 

ఇంత ధైర్యం ఎందుకొచ్చిందంటే, ఆయన కొక యూనివర్శిటీ ఉంది. దాని పేరు గీతం యూనివర్శిటీ . బాగా వ్యాపారం జరగుతూ ఉంది. అదింకా బాగా బలచాలంటే, ఆంధ్రా యూనివర్శిటీ పరువుదీయాలి. అదీ సంగతి. దీనికోసం ఆయనొక క్యాంపెయిన్ మొదలుపెట్టారని స్థానికులు మీడియా చెబుతూ ఉంది. ఎపుడూ తనకు తోచిన ప్రతిపద్ధతిలో ఆయన యూనిర్శిటీ మీద రాళ్లేస్తూ ఉంటారు. మొన్నా మధ్య కౌన్సిల్ మాట్లాడుతూ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో గంజాయి  పెరుగుతూ ఉందని ఆరోపించారు. ఆయనకు నిజంగా ఎయు మీద అంత అభిమానం ఉంటే, ఈ విషయాన్ని వైస్ చాన్స్ లర్ దృష్టికి తీసుకువెళ్లాలి.  చర్చించాలి. ఆ విశ్వవిద్యాలయం ప్రతిష్ట పెరిగేందుకు  కృషి చేయాలి. అలాంటిది ఆయన ఎపుడూ చేసినట్లు కనిపించదు.

 

స్థానిక మీడియా కథనాల ప్రకారం,ఆయన తన విద్యావాణిజ్య సంస్థలనుమెరుగుపర్చుకోవడానికి చివరకు ఎంపి నిధులను కూడా వాడారట. 90 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆంధ్రా యూనివర్శిటీకి దేశంలోనే ఒక విశిష్టమయిన స్థానం ఉంది. ఇప్పటికీ  అదొక గొప్ప విశ్వవిద్యాలయం కిందే లెక్క.అందుకే  డాక్టరేట్ తెచ్చకున్నారని చెబుతారు.

 

ఏయూలో టీడీపీ మ‌హానాడు జరుగబోతున్న సంగతి తెలిసిందే.  గ‌తంలో ప‌లువురికి అనుమ‌తి నిరాకరించిన గ్రౌండ్ లో ఇప్పుడు తెలుగుదేశంపార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఎలా అనుమ‌తిస్తార‌ని మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు. టిడిపి విశ్వవిద్యాలయాన్ని ఇలా వాడుకోవడం మీద  విశాఖ‌లో తీవ్ర రూపంలో ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విద్యార్థుల ఆందోళ‌న‌పై స్పందిస్తూ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి ఏయూను ఓ దెయ్యాల కొంప‌గా అభివ‌ర్ణించారు. వాటికి అద్దె చెల్లించి వాడుకుంటే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించారు. దెయ్యాల కొంప‌ను అద్దెకివ్వ‌డంలో త‌ప్పేంట‌ని నిల‌దీశారు. దాంతో ఆయ‌న వ్యాఖ్య‌లు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తున్నాయి. ప‌లువురు త‌ప్పుబ‌డుడుతున్నారు., విద్యార్థులు క్యాంప‌స్ లో ఆందోళ‌న‌ల‌కు దిగారు.

 

ఇలాంటి వ్యక్తి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని దెయ్యాల కొంప అనడం మూర్తికి చెల్లవచ్చు. అయితే, ఈమాట విద్యార్థులను స్థానికులను తీవ్రంగా కలచివేసింది.చివరకు తెలుగుదేశంహెచ్ ఆర్ డి మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా దీనికి అభ్యంతరం చెప్పారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios