విజయవాడ:  రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖామం అలాగే చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావడం తధ్యం అంటూ ధీమా వ్యక్తం చేశారు. 

శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన డొక్కా మాణిక్య వరప్రసాద్ మహిళలంతా మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. డ్వాక్రా రుణాలు అయితే నేమీ, పసుపు కుంకుమ పథకాలు, ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందజెయ్యడం, వృద్ధాప్య పింఛన్ రూ.2000కి పెంచడంతో ప్రజలంతా మళ్లీ నువ్వే రావాలి బాబు అంటున్నారని స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. 

సర్వేల పేరుతో మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్, కేసీఆర్, పవన్ కళ్యాణ్ వంటి ముగ్గురు మోదీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ చంద్రబాబే సీఎం అవుతారని డొక్కా మాణిక్య వరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.