రాజకీయ సిద్ధాంతాల్ని తుంగలో తొక్కి జగన్, జీవీఎల్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. శాసనమండలి సమావేశాల సందర్భంగా ఆమన మీడియాతో మాట్లాడుతూ...రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కులాల్ని గురించి మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేముందు తన గురించి కూడా తెలుసుకోవాలని ఆయన సూచించారు. 17 నెలలు జైల్లో ఉన్న ఓ ఆర్ధిక నేరస్తుడైన జగన్ బరితెగించి డీజీపీనీ, పోలీస్ వ్యవస్థను విమర్శిస్తున్నారని బుద్దా మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని ఏ వ్యవస్థ మీదా నమ్మకం లేదని...కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఆశ మాత్రం ఉందన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కులాల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డినని వెంకన్న వ్యాఖ్యానించారు.