అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వైసీపీ అన్నింటికి తెగించిందని విమర్శించారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన బుద్దా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ సుమారు రూ.8వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్ ఒక ఆర్థిక నేరస్థుడంటూ విరుచుకుపడ్డారు. 

జగన్‌ దగ్గర విజయసాయిరెడ్డి, సి.రామచంద్రయ్యలు శకునిలాంటి వారని విమర్శించారు. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుపై బురద చల్లితే ఆకాశంపై ఉమ్మివేసినట్లేనని అభిప్రాయపడ్డారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పూటకో పార్టీ మారుతావ్, నిన్ను వైసీపీయే గుర్తించదు: సీఆర్ పై బుద్ధా వెంకన్న ఫైర్