అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సి.రామచంద్రయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చిన వ్యక్తి సిఆర్ అంటూ విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడును విమర్శించే అర్హత సి.ఆర్ కు లేదన్నారు. 

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన సిఆర్ ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారన్నారు. ప్రజారాజ్యం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేశారని....తాజాగా వైసీపీలో చేరి చంద్రబాబును విమర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. 

పూటకో పార్టీ మార్చే సి.రామచంద్రయ్యను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం సి. రామచంద్రయ్యను పట్టించుకోవడం లేదన్నారు. ఇకపోతే ప్రధాని నరేంద్రమోదీతో కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈవీఎలం మెరాయింపుపై చంద్రబాబు ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. 

ఈవీఎంల మెరాయింపుపై చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే దేశవ్యాప్తంగా బీజేపీకి 120 సీట్లు కంటే ఎక్కువ రావని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు.