అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యంగాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల భీమా ప్రీమియం ప్రధాని నరేంద్రమోదీ కట్టలేదని చెప్పుకొచ్చారు. 

మ‌న జ‌గ‌న‌న్న ప‌ట్టించుకోలేదు. 2.6 కోట్ల మందికి ధీమా ఏదీ? భీమా పేరు ముందు చంద్ర‌న్న పేరుంద‌నా? విజ‌య్ గారూ! అంటూ సెటైర్లు వేశారు. ఇటీవలే మోడీగారు మిమ్మల్ని ప‌ల‌క‌రించారు.

మిమ్మల్ని ప్రధాని నరేంద్రమోదీ పలకరించడంతో పులకరించిపోయారు. ఆ చనువుతోనైనా బడుగు బ‌తుకుల‌కు భ‌రోసా క‌ల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భీమా ప్రీమియం చెల్లించే ఏర్పాటు చేయండి అంటూ బుద్ధా వెంకన్న సెటైర్లు చేశారు.