గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ తన విలాసాల కోసం ప్రజాధనాన్ని ఇష్టారీతిగా దుర్వినియోగం చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ  బుద్దా వెంకన్న మండిపడ్డారు. తాజాగా సీఎం క్యాంప్ ఆపీసులో కరెంట్ పని, కుర్చీల కోసమే నాలుగుకోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వమే ప్రకటించిందని... ఇలా ప్రజాధనాన్ని ఖర్చుచేయడం ఏమిటంటూ  బుద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''రాజ భవనానికి ప్రజల సొత్తుతో సోకులు. ప్రజా ధనంతో దుబారా సబబు కాదు వైఎస్ జగన్ గారు. మంచినీళ్లు, మజ్జిగ కోసం కోటి, కరెంట్ పని, కుర్చీల కోసం 4 కోట్లు. మంది సొమ్ముతో విలసాలు ఏంటి? ఊరికో రాజ భవనం నిర్మించుకోవడం మీకు ఫ్యాషన్ అయినా వాటిని నిర్వహించే స్తోమత రాష్ట్ర ప్రజలకు లేదు జగన్ రెడ్డి గారు'' అంటూ ఆర్ఆండ్‌బి శాఖ విడుదల చేసిన జీవోను జతచేస్తూ వెంకన్న ట్వీట్ చేశారు. 

read more  భారీగా పెరిగిన వైసిపి నడిమంత్రపు సిరి... కారణమదే: యనమల రామకృష్ణుడు

''వామ్మో ఈ దోపిడీ ఏంటి జగన్ గారు?బాబు గారు తన సొంత ఖర్చులతో హిమాలయా వాటర్ బాటిల్ తెచ్చుకుంటేనే గోల గోల చేసారు.. ఇప్పుడు ప్రజాధనంతో మీరు చేస్తున్న దుబారాకి ఎం సమాధానం చెబుతారు?'' అంటూ ఇదివరకే ఇదే ట్విట్టర్ వేదికన వెంకన్న ప్రశ్నించిన విషయం తెలిసిందే.  

''విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న జగన్ రెడ్డి వాటర్ బోటిల్, మజ్జిక ప్యాకెట్ ల కోసం, 43.44 లక్షలు స్వాహా జగన్ గారి ప్రమాణ స్వీకారానికి, ఇప్పటికీ డబ్బులు విడుదల చేస్తూనే ఉన్నారు. వాటర్ బాటిల్స్, స్నాక్స్ కోసం,59.49 లక్షలు స్వాహా'' అంటూ మరో ట్వీట్ చేశారు. 
 
''చంద్రబాబు గారు పేదల కోసం నిర్మించిన ఇళ్లను క్వారంటైన్ సెంటర్లు గా మార్చుకున్న మీ అల్లుడు గారిని అడగండి అడ్రెస్స్ చెబుతారు విజయసాయి గారు. ఇక గ్రాఫిక్స్,  స్మశానం అంటారా మొన్నే మీ మంత్రి బొత్సా ఆ భవనాలు ఎక్కి గ్రాఫిక్స్ అనుకోని దూకబోతే పోతారు ఆగండి అని పిఏ పట్టుకొని ఆపాడట. ఒక్క సారి మీరు ట్రై చెయ్యండి గ్రాఫిక్స్ అవునో, కాదో తేలిపోతుంది కదా!'' విజయసాయి రెడ్డిని కూడా ఎద్దేవా చేస్తూ వెంకన్న ట్వీట్ చేశారు.