Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌ను ఏ రాష్ట్రం స్వాగతించినా ఏపీ గౌరవించదు.. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సంచలన కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందించారు. కేసీఆర్‌లో జాతీయత లేదు.. నిజాయితీ లేదని విమర్శించారు. 

TDP MLC Ashok Babu Response On BRS Party
Author
First Published Oct 6, 2022, 5:20 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందించారు. కేసీఆర్‌లో జాతీయత లేదు.. నిజాయితీ లేదని విమర్శించారు. జాతీయ పార్టీ పెట్టినా.. కేసీఆర్‌లో జాతీయత లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ను ఏ రాష్ట్రం స్వాగతించినా ఏపీ గౌరవించదని అన్నారు. ఏపీని ముక్కలు చేసి ఆర్థికంగా దెబ్బతీసి.. ద్వితీయ శ్రేణి రాష్ట్రం అన్నందుకు ఇక్కడి ప్రజలు మాత్రం గౌరవించరని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని.. ఆయన నిజాయితీ ఏ పాటిదో చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. 

తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత మాట తప్పారని విమర్శించారు. ఉడుతకు పులి అని పేరు పెడితే పులి అయిపోదని ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ వేరు జాతీయ వాదం వేరని అన్నారు. వ్యాపారాలు వేరని.. రాజకీయాలు వేరని వ్యాఖ్యానించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తామని చెప్పారు కానీ.. జేడీఎస్‌ను బీఆర్ఎస్‌లో కలుపుతామని చెప్పలేదని అన్నారు. జేడీఎస్ పోటీ చేయని చోట్ల బీఆర్ఎస్ పోటీ చేస్తుందేమోనని అన్నారు. సరిహద్దు జిల్లాలో తెలుగువారు ఎక్కువ మంది ఉన్నారనే.. బీఆర్ఎస్‌ను రమ్మని జేడీఎస్ అడిగి ఉండవచ్చని అన్నారు. 

ఇదిలా ఉంటే.. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ బుధవారం ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్.. ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా మారనుంది. ఇక, తెలంగాణ భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పేరు మార్పు, ఎజెండాను కేసీఆర్.. పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారు. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే చీఫ్ తిరుమలవలన్ కూడా పాల్గొన్నారు. పార్టీ పేరును మారుస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత వారు శుభాకాంక్షలు చెప్పారు. 

ఇక, జాతీయ పార్టీని ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఇప్పటికే ఆయన పలువురు టీడీపీ నేతలతో చర్చలు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే పలు సామాజిక వర్గాలకు చెందిన నేతలను ఆయన తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios