ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగానికి టీడీపీ సభ్యులు పదేపదే అంతరాయం కలిగించడంతో 17 మంది తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రి వివరణ ఇచ్చే సమయంలో స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ సభ్యులు చొచ్చుకురావడంతో వారిని సస్పెండ్ చేయాల్సిందిగా మంత్రి బుగ్గన సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

సస్పెండైన ఎమ్మెల్యేలు:

* పయ్యావుల కేశవ్
* రామానాయుడు
* సత్యప్రసాద్
* వీరాంజనేయ స్వామి
* బుచ్చయ్య చౌదరి
* వాసుపల్లి గణేశ్
* కరణం బలరామ్
* ఆదిరెడ్డి భవాని
* అచ్చెన్నాయుడు
* వెంకట్ రెడ్డి
* ఏలూరి సాంబశివరావు
* గద్దె రామ్మోహన్
* మంతెన రామరాజు
* గొట్టిపాటి రవికుమార్
* వెలగపూడి రామకృష్ణ
* జోగేశ్వరరావు
* నిమ్మకాయల చినరాజప్ప

అంతకుముందు చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా చంద్రబాబుకు జగన్ కౌంటరిచ్చారు.

Also Read:చంద్రబాబు తప్ప ఎవరూ ఉండరు: వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం

ప్రతిపక్షనేతకు ఇచ్చినంతటి గౌరవం ఏ ప్రభుత్వం ఇవ్వలేదని అయినప్పటికీ ఆయన దుర్వినియోగం చేసుకుంటున్నారని సీఎం ప్రస్తావించారు. చంద్రబాబుకు అమరావతి మీదా ప్రేమ లేదని ఎవరి మీదా గౌరవం లేదన్నారు. వీరికన్నా రాక్షసులు, దుర్మార్గులు, కీచకులు ఎవరు ఉండరేమోనంటూ జగన్ మండిపడ్డారు.