విశాఖపట్నం: పార్టీ ఫిరాయింపులపై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

ఇప్పటికే 10మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. జగన్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు చేరతామంటూ పదేపదే తమకు చెప్తున్నారని తెలిపారు. అయితే సీఎం జగన్ ఫిరాయింపులకు డోర్లు లాక్ చేయడంతో వారి రాకకు అడ్డంకిగా మారిందన్నారు. 

జగన్ డోర్లు లాక్ చేయకపోతే ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేదన్నారు. ప్రస్తుతం టచ్ లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తే మిగిలిన వారు కూడా క్యూ కట్టేవారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. 

తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తుడుచుకుపుపెట్టుకుపోతుందన్నారు. ఇక పార్టీ బతికిబట్టకట్టగలిగే ప్రసక్తే లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన తప్పులను, అవినీతిని బయటకు తీస్తామని హెచ్చరించారు. 

మరోవైపు విశాఖపట్నంలో భూ కుంభకోణంపై సిట్ నివేదికను బయటపెట్టాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భూమ అక్రమణలపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అవంతి డిమాండ్ చేశారు.