ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి పోలవరం సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యేల బస్సు స్వల్ప ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న వాహనం ఏలూరు సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన మట్టిలో దిగబడిపోయింది.

డ్రైవర్ ఎంతసేపు ప్రయత్నించినప్పటికీ బస్సు కదలకపోవడంతో 35 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేరే వాహనాల్లో పోలవరానికి తరలించారు.