ప్రకాశం : ఫిరాయింపులు, వరుస వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తీపికబురు అందింది. టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో టెన్షన్ తో ఉన్న చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ శుభవార్త చెప్పారు. 

బీజేపీతో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్‌లో లేరని స్పష్టం చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం తమతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని రోజుకొకరు చొప్పున నేతలు పార్టీలో చేరుతున్నారంటూ క్లారిటీ ఇచ్చేశారు.  

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇతర పార్టీల నుంచి నాయకులు బీజేపీలోకి వలస వస్తున్నారని తెలిపారు. బీజేపీలో ఎవరు చేరినా తాము స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. ఏపీలో 2014 నాటికి బీజేపీ బలోపేతం అవుతుందని వైసీపీకి ప్రత్యామ్నాయంగా మారుతుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు కన్నా లక్ష్మీనారాయణ. 

టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో లేరని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించడంతో టీడీపీ అధిష్టానం ముఖ్యంగా సీఎం చంద్రబాబు హమ్మయా సేఫ్ అనుకున్నారట. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గోడదూకుతాడో, అసలు ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా అన్న సందేహం నుంచి తాను సేఫ్ అయ్యానని ఆనందంలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.