ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు, అసెంబ్లీని కించపర్చేలా ఉన్నాయని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే టి.శ్రవణ్ కుమార్ మంగళవారం నాడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. 

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు, అసెంబ్లీని కించపర్చేలా ఉన్నాయని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే టి.శ్రవణ్ కుమార్ మంగళవారం నాడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సీఎం చంద్రబాబునాయుడుతో పాటు అసెంబ్లీని కించపర్చేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను చర్యలు తీసుకోవాలని కోరుతూ తాడికొండ ఎమ్మెల్యే టి.శ్రవణ్‌కుమార్ ఇవాళ ఏపీ స్పీకర్ కోడేల శివప్రసాదరావుకు ప్రివిలేజ్ మోషన్‌ నోటీసును అందించారు.


జీవీఎల్ తీరును టీడీపీ తప్పుబట్టింది. సీఎంను, శాసనసభను అవమానపర్చేలా జీవీఎల్ వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో జీవీఎల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌కు నోటీసును ఇచ్చినట్టు ఆయన చెప్పారు.