నా సెక్యూరిటీ విషయంలో రాజకీయం: జగన్ సర్కార్ పై పయ్యావుల సంచలనం
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కీలక విషయాలను బయట పెడుతున్నందున తన సెక్యూరిటీ విషయమై ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పారు. అంతేకాదు తనపై కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తనకు సమాచారం ఉందన్నారు.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కీలక విషయాలను బయట పెడుతున్నందున తనను మానసికంగా ఁఒత్తిడికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని TDP ఎమ్మెల్యే Payyavvula Keshav చెప్పారు. ఈ క్రమంలోనే తన సెక్యూరిటీని డిస్టర్బ్ చేశారని ఆయన అన్నారు.
బుధవారం నాడు అమరావతిలో పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గంలో మూడు నెలలుగా సాగుతున్న పరిణామాలను గమనించిన తర్వాత తనకు భద్రత పెంచాలని ఇంటలిజెన్స్ చీఫ్ ను కలిసి కోరినట్టుగా పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. తనకు ఉన్న 1+1 గన్ మెన్ ను 2+2 గన్ మెన్లను కేటాయించాలని కోరామన్నారు. కానీ ఆ తర్వాతే తన భద్రత విషయమై డిస్టర్బ్ చేవారని పయ్యావుల కేశవ్ చెప్పారు.
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ నక్సలైట్ గ్రూపులకు చెందిన మిలిటెంట్ల కదలికలు పెరిగాయన్నారు. వీరంతా ఉరవకొండ నియోజకవర్గానికి చెందినవారు కూడా కాదన్నారు. ఈ విషయమై తాను ఈ విషయాన్ని ఇంటలిజెన్స్ చీఫ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలిపారు.
Naxaliteతో తాను గతంలో తాను పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. Andhra Pradesh రాష్ట్రంలో నక్సలైట్లతో పోరాటం చేసన ఎమ్మెల్యే తాను ఒక్కడినే అన్నారు. Telangana లో మాత్రం నక్సల్స్ బాధితులు చాలానే ఉన్నారన్నారు.
ఆర్ధిక అంశాలు. గంగవరం పోర్టుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలను తాను బయటపెట్టడంతో తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. గతంలో తాను పదేళ్ల పాటు ప్రభుత్వంపై పోరాటం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కేశవ్ చెప్పారు తన భద్రత విషయంలో ప్రభుత్వం రాజకీయం చేస్తుందన్నారు.
తన ప్రాణాలకు ప్రభుత్వం హాని కల్గిస్తుందా లేదా అనేది మాత్రం చెప్పదల్చుకోలేదన్నారు. ప్రతిపక్ష నేతలపై వేధింపులు ఎక్కువ కాలం కొనసాగవని పయ్యావుల కేశవ్ చెప్పారు. ఎమర్జెన్సీలో ఇంత కన్నా ఎక్కువగా విపక్ష నేతలపై వేధింపులు జరిగాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో TDP నేతలపై ప్రభుత్వం బనాయించిన కేసులు నిలబడవని ఆయన చెప్పారు. ప్రభుత్వం తన విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తుందోననే దానిపై మూడో ఎపిసోడ్ ను కూడా త్వరలోనే వెల్లడిస్తానని కేశవ్ చెప్పారు.
తాను Hyderabad కు గన్ మెన్లను తీసుకెళ్లవద్దని చెబుతున్నారన్నారు. కానీ వైసీపీ నేతలు హైద్రాబాద్ లో గన్ మెన్లతో వెళ్తున్నారన్నారు. తనపై కేసులు పెట్టేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తనకు సమాచారం ఉందని పయ్యావుల కేశవ్ చెప్పారు.