తాను వాస్తవాలు బయటపెడుతుండడం వల్లే ఏపీ అసెంబ్లీ నుంచి తనను సస్పెండ్ చేశారని టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత టిడ్కో ఇళ్లపై చర్చ కోసం టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. దీంతో టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు నిమ్మల రామానాయుడును ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు.

అనంతరం రామానాయుడు మాట్లాడుతూ 2019-20 మధ్య ఇన్సూరెన్సు కట్టకపోవడం వల్ల రైతులకు ఇన్సూరెన్స్ రాలేదని అన్నారు. మంగళవారం అసెంబ్లీ షోరూమ్ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని... దానికి డాక్యుమెంట్ తో సహా వెల్లడించామని తెలిపారు. వాస్తవాలు ఆధారాలతో బయట పెడుతున్నందునే తనను సభ నుండి సస్పెండ్ చేశారని విమర్శించారు.
నిన్న రాత్రి 9:02గంటలకు హడావిడిగా ఇన్సూరెన్స్ ప్రీమియం జీఓ ఇచ్చారని.. బడ్జెట్ రిలీస్ చేశారని తెలిపారు. రైతాంగం నష్టపోయాక ఇప్పుడు ప్రీమియం కడితే ఉపయోగం ఉంటుందా? అని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తికి, చనిపోయాక రూ.100 కోట్లు ప్రీమియం చేయిస్తే ఉపయోగం ఉంటుందా....? అని నిలదీశారు.
ఇది అసెంబ్లీని, రైతులను తప్పు దోవ పట్టించాడమే అని... సభను మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండపడ్డారు. దీనికి సంబంధించి వారిపై సభా హక్కుల నోటీస్ ఇస్తామని స్పష్టం చేశారు.
రూ.33 కోట్లు అరకొరగా ప్రీమియం కట్టడం వల్లే ఏపీ 2019లో అసలు ఒక్క క్లైమ్ కూడా రాలేదన్నారు. టీడీపీ హయాంలో ప్రతీ రైతుకు ఇన్సూరెన్స్ అందిందని చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కూడా 2019-2020 ఇన్సూరెన్స్ చెల్లించినట్టు కేంద్రం నివేదికలు చెపుతున్నాయన్నారు.
కానీ మన రాష్ట్రంలో రూపాయి కూడా ఇన్సూరెన్స్ చెల్లించలేదని విమర్శించారు. నిన్న టీడీపీ ఆందోళన చేయడంతో అర్ధరాత్రి ఇన్సూరెన్స్‌పై జోవో ఇచ్చారన్నారు. ఎన్ని సస్పెన్షన్‌లు చేసినా రైతుల కోసం వెనకడుగు వేసేది లేదని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 1, 2020, 12:41 PM IST