సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి తన మార్కు ఆగ్రహాన్ని చూపించారు. హిందూపురంలో ప్రచారం సాగిస్తున్న బాలకృష్ణ ఓ అభిమానిపై చేయి చేసుకున్నారు. విడీయో తీసినందుకు ఆయన ఆ పని చేశారు.
అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ తమ మార్కు ఆగ్రహాన్ని మరోసారి చూపించారు. హిందూపురంలో ప్రచారం చేస్తున్న బాలకృష్ణ ఇందులో భాగంగా ఓ ఇంట్లోకి వెళ్లారు. అక్కడి ఆయన మాట్లాడుతున్న సమయంలో ఓ అభిమాని వీడియో తీశాడు.
దాంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అభిమానిపై చేయి చేసుకున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే వీడియో తీస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆయన అభిమానులపై ఇటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.
ఇదిలావుంటే, తనపై విమర్శలు చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులకు టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు. మున్నిపల్లో ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ప్రచారం చేస్తున్నారు. తన ప్రసంగంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.
తాను తిడితే తనంత బూతులు తిట్టేవారు మరొకరు ఉండరని ఆయన అన్నారు. తనకు సంస్కారం ఉందని, అయితే ఎదుటివాళ్లు నోరు పారేసుకుంటే ఊరుకోనని ాయన అన్నారు. తనకు ఒక్క పని కాదు, అనేక పనులు ఉన్నాయని చెప్పారు.
బసవతారకం ఆస్పత్రి చైర్మన్ గా తాను రోగులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు సినిమాల ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతున్నానని బాలకృష్ణ చెప్పారు.
"
