పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే మంతెన రామరాజు పాలకోడేరు మండలం మోగల్లులోని గోస్తనీ డ్రైన్ సూయిజ్ పై నిరసనకు దిగారు. ఈ కాలువ కారణంగా పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. డ్రైనేజీ అధికారులు పట్టించుకోకపోవటంతో వారి తీరుకు నిరసనగా పంటపొలాల ప్రాంతంలో బైఠాయించినట్లు తెలిపారు. వెంటనే అధికారులు వచ్చి రైతులకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే మంతెన డిమాండ్ చేశారు. 

వీడియో