పవన్ కళ్యాణ్‌‌పై జలీల్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Tdp MLA jaleel khan slams on Pawan kalyan
Highlights

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓ దొంగ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.మంగళవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.


విజయవాడ:జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై  ఎమ్మెల్యే జలీల్‌ఖాన్  తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.  పవన్ కళ్యాణ్ ఓ దొంగ అని ఆయన ధ్వజమెత్తారు.  పవన్ కళ్యాణ్, జగన్, కన్నా లక్ష్మీనారాయణల చరిత్రలు ఏమిటో ప్రజలకు తెలుసునని  ఆయన విమర్శలు గుప్పించారు.

విజయవాడలో మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఏం చేశారో అందరికీ తెలుసునని చెప్పారు.పీఆర్పీ నుండి మంత్రి పదవిని తీసుకొన్న చరిత్ర మీది కాదా అంటూ ఆయన నిలదీశారు.

ప్రధాన మంత్రి మోడీతో పవన్ కళ్యాణ్, జగన్ కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. జగన్ తనను తాను రక్షించుకోవడం కోసమే పాదయాత్ర చేస్తున్నారని  జగన్ పై జలీల్ ఖాన్ విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి  విపక్ష నేతలు సహకరించడంపై ఆయన మండిపడ్డారు. 

ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హమీలను బీజేపీ తుంగలో తొక్కిందని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ హమీలను నెరవేర్చనందుకే ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు ఆయన గుర్తు చేశారు. 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader