టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పనులకు కాసేపు విరామం ప్రకటించి మనవడితో కలిసి కాసేపు క్రికెట్ ఆడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

నిత్యం రాజకీయాలు, వ్యాపారాలతో క్షణం తీరిక లేకుండా గడిపే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పనులకు కాసేపు విరామం ప్రకటించి మనవడితో ఆడుకున్నారు. విశాఖలోని తన నివాసంలో ఆయన బ్యాటింగ్ చేయగా.. మనవడు బౌలింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇదిలావుండగా.. గంటా శ్రీనివాసరావు తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. రెండేళ్లు కోవిడ్‌, తర్వాత తన అనారోగ్య కారణాల వల్లే పార్టీలో యాక్టివ్‌గా ఉండలేకపోయానని చెప్పారు. మధ్యలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని.. ఇప్పటి నుంచి యాక్టివ్‌గా ఉంటానని చెప్పారు.

చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న గంటా శ్రీనివాసరావు ఇటీవల నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో.. ఇరువురు నేతల మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. అయితే చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న గంటా శ్రీనివాసరావు.. ఇందుకు సంబంధించిన అంశాలను లోకేష్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది. ఆ భేటీ తర్వాత గంటా శ్రీనివాసరావు వైఖరిలో మార్పు వచ్చిందనే ప్రచారం కూడా టీడీపీ శ్రేణుల్లో సాగుతుంది. 

Scroll to load tweet…