కరోనా వైరస్‌ నివారణకు భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ట్రయల్‌రన్‌కు టీడీపీ నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ దంపతులు వాలంటీర్లుగా ముందుకొచ్చారు.

తొలి ట్రయల్‌లో భాగంగా గద్దె రామ్మోహన్‌, ఆయన సతీమణి అనురాధ టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకున్న తర్వాత అంతా బాగానే ఉందని వారు చెప్పారు. రెండో ట్రయల్‌లో జనవరి 4న రామ్మోహన్‌, అనురాధ మరో డోసు  వేయించుకోనున్నారు.

టీకా వేయించుకున్న అనంతరం రెగ్యులర్‌ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు వారికి సూచించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు తాను కూడా సేవ చేశాననే సంతృప్తి మిగులుతుందన్నారు.