Asianet News TeluguAsianet News Telugu

''అక్రమ ఆస్తులపై సిబిఐ విచారణ... ఏపి విద్యాశాఖ మంత్రికి సుప్రీంకోర్టులో షాక్''

అక్రమ ఆస్తులను కలిగి వున్నారన్న ఆరోపణల నేఫధ్యంతో సుప్రీంకోర్టు కూడా సిబిఐ విచారణకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తన పదవికి రాజీనామా చేయాలని టిడిపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు.

TDP MLA Dola Veeranjaneya Swamy Demands Education Minister Suresh Resignation
Author
Amaravati, First Published Sep 2, 2021, 4:09 PM IST

అవినీతి, అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టిడిపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు. సురేశ్ లాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే భావిభారత పౌరులుగా మారాల్సిన విద్యార్థులు దారి తప్పే ప్రమాదం వుందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంపై సురేశ్ కు ఏమాత్రం గౌరవమున్నా తనకు తానే పదవినుంచి వైదొలగాలని వీరాంజనేయస్వామి సూచించారు.
 
మంత్రి ఆదిమూలపు సురేశ్ తో పాటు ఆయన సతీమణి విజయలక్ష్మి పేరిట అక్రమ ఆస్తులున్నాయని సీబీఐ గతంలో చెప్పిందని... అయితే దానిపై విచారణ జరక్కుండా మంత్రి హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని అన్నారు. కానీ తాజాగా సుప్రీంకోర్టు వారు అక్రమాస్తులు కలిగిఉన్నందున వారిని విచారించి చర్యలు తీసుకోవాలని తీర్పునిచ్చిందని బాలవీరాంజనేయ స్వామి తెలిపారు.  

సుప్రీం తీర్పు నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ తక్షణమే తన మంత్రిపదవికి రాజీనామా చేయాలని... భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యాశాఖలో ఆయన కొనసాగడానికి వీల్లేదని టీడీపీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి మొదలు కేబినెట్ లోని సగంమందిపై అవినీతి  ఆరోపణలున్నాయని... ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తనప్రభుత్వాన్ని రద్దుచేసి తక్షణమే ఎన్నికలకు వెళ్లాలన్నారు టిడిపి ఎమ్మెల్యే డోలా. 

read more  ఓవరాక్షన్ చేస్తున్న పోలీసులకు... భవిష్యత్ లో భంగపాటు తప్పదు: అచ్చెన్న వార్నింగ్

అవినీతి, అక్రమార్జనపై దృష్టిపెట్టిన ఆదిమూలపు సురేశ్ తనసొంతజిల్లా అభివృద్ధికోసం ఒక్క పనికూడా చేయలేదన్నారు. మార్కాపురంలో పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థి మృతి చెందినా మంత్రి పట్టించుకోలేదన్నారు. ఆదిమూలపు సురేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని వెలిగొండ ప్రాజెక్ట్  పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని... అయినా ఆయన ఏనాడూ ఆ ప్రాజెక్ట్ గురించి ముఖ్యమంత్రితో గానీ, కేంద్రంతో గానీ మాట్లాడింది లేదని డోలా మండిపడ్డారు. 

అంబేద్కర్ రాజ్యాంగంపై సురేశ్ కు ఏమాత్రం గౌరవమున్నా తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని వీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు. సురేశ్ లాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే, విద్యార్థులు కూడా గాడితప్పుతారన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంపై సురేశ్ కు నమ్మకంలేదని గతంలో ఆయనచేసిన వ్యాఖ్యలను బట్టే అర్థమవుతోందన్నారు. 

చిన్నారుల భవిష్యత్ కోసం సురేశ్ మంచినిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ సంతోషిస్తారన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ముఖ్యమంత్రి తక్షణమే ఆదిమూలపు సురేశ్ పై సీబీసీఐడీ విచారణకు ఆదేశించాలన్నారు. ఆదిమూలపు సురేశ్ అవినీతి బాగోతంపై సీబీఐనే స్వయంగా విచారణ జరపాలని ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios