Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ కక్షతోనే బాబుపై కేసు:క్షమాపణలకు బాలకృష్ణ డిమాండ్

అక్రమంగా చంద్రబాబుపై కేసు పెట్టారని టీడీపీ ఎమ్మెల్యే  బాలకృష్ణ ఆరోపించారు.  తప్పుడు కేసు పెట్టినందుకు బాబుకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలన్నారు.

TDP MLA Balakrishna Demands apology From YS Government For Wrong Cases on Chandrababu lns
Author
First Published Sep 21, 2023, 1:15 PM IST

అమరావతి:రాజకీయ కక్షసాధింపుతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు.


ఏపీ అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురైన తర్వాత  అమరావతిలో  టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుపై అక్రమంగా  కేసు పెట్టారని బాలకృష్ణ  చెప్పారు. దీనిపై  పోరాటం కొనసాగిస్తామన్నారు. ఇలాంటి కేసులను కూడ గతంలో కూడ చూసినట్టుగా ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుపై పెట్టిన కేసును భేషరతుగా ఎత్తివేయాలని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తప్పుడు కేసు పెట్టినందుకు చంద్రబాబుకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని బాలకృష్ణ కోరారు.

సినీ రంగం నుండి వెళ్లిన ఎన్టీఆర్ పార్టీని పెట్టి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని బాలకృష్ణ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో  అనేక మంది పెట్టుబడి దారులు  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీం ద్వారా  విద్యార్థులకు మంచి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కల్పించినట్టుగా  బాలకృష్ణ గుర్తు చేశారు.

స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా విద్యార్థులు లబ్ది పొందితే  అవినీతి జరిగిందని  ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసును తప్పుడు కేసుగా  బాలకృష్ణ పేర్కొన్నారు.ఏపీలో వైఎస్ జగన్ పాలనను నియంతృత్వంగా  బాలకృష్ణ ఆరోపించారు. టీడీపీని లక్ష్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీపై  ఆయన ఆరోపించారు.

also read:నా వృత్తిని మంత్రి అంబటి అవమానించారు: ఏపీ అసెంబ్లీలో మీసం తిప్పడంపై బాలకృష్ణ

టీడీపీ చీఫ్ చంద్రబాబును ఏపీ సిల్క్ డెవలప్ మెంట్ కేసులో  ఈ నెల  9వ తేదీన ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబును రాజమండ్రి జైల్లో ఉన్నాడు. ఈ కేసులో చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ  కోర్టును కోరింది. ఈ  పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించనుంది. మరో వైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో కూడ చంద్రబాబుపై పీటీ వారంట్ జారీ చేశారు. దీనిపై  చంద్రబాబు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ బెయిల్ పిటిషన్ పై  ఈ నెల  26న విచారణ నిర్వహించనుంది ఏపీ హైకోర్టు.

 

Follow Us:
Download App:
  • android
  • ios