అనంతపురం: ప్రముఖ సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమీక్షలతో హల్ చల్ చేస్తున్నారు. రెండు రోజులుగా నియోజకవర్గంలోని పలు మండలాల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. 

నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ వివరాలపై ఆరా తీస్తున్నారు. ఏయే గ్రామాల్లో టీడీపీకి అత్యధిక శాతం ఓటింగ్ నమోదు అవుతుంది, ఎక్కడ మెజారిటీ వస్తుంది, ఎక్కడ ముందు ఉన్నాం అనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 

పోలింగ్ జరిగిన చోట బూత్ లవారీగా ఓట్ల సంఖ్య, వివరాలు వంటి అంశాలు అందించాలని కోరుతున్నారట. అలాగే భవిష్యత్ లో తీసుకోవాల్సిన చర్యలు, నియోజకవర్గ అభివృద్ధి, పేరుకుపోయిన సమస్యలపై కూడా ఆరా తీస్తున్నారట బాలయ్య. 

ఈసారి ఎన్నికల్లో కూడా తానే గెలుస్తానని బాలకృష్ణ మంచి ధీమాతో ఉన్నారట. మరి ఆయన ధీమా నెరవేరుతుందో లేక ఏమవుతుందో తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.