Asianet News TeluguAsianet News Telugu

బెదిరించలేదు, స్వచ్ఛంధంగానే వైసీపీలోకి: బాబుకు రామసుబ్బారెడ్డి కౌంటర్

ఎవరో బెదిరింపులకు పాల్పడితే తాము టీడీపీని వీడడం లేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వచ్ఛంధంగానే తాను టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్టుగా ఆయన ప్రకటించారు

Former minister Rama subba reddy counter attack on Chandrababunaidu after joining in ysrcp
Author
Amaravathi, First Published Mar 11, 2020, 6:30 PM IST


అమరావతి: ఎవరో బెదిరింపులకు పాల్పడితే తాము టీడీపీని వీడడం లేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వచ్ఛంధంగానే తాను టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. బుధవారంనాడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

Also read:కడప జిల్లాలో బాబుకు మరో షాక్: వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

టీడీపీలో చోటు చేసుకొన్న లోపాలు, నాయకత్వంపై నమ్మం కోల్పోవడం కారణంగానే నేతలంతా టీడీపీని వీడుతున్నారని ఆయన చెప్పారు. తమ కుటుంబం సుధీర్ఘంగా టీడీపీలోనే ఉందన్నారు. తమ బాబాయ్ శివారెడ్డి తమ కుటుంబం టీడీపీలోనే ఉందన్నారు. తాను జైలులో ఉన్న సమయంలో కూడ పార్టీ కోసం కార్యకర్తలు ధైర్యంగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. 

టీడీపీ ఆవిర్భావం నుండి అదే పార్టీలోనే కొనసాగుతూ అనేక ఆటుపోట్లను కూడ కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.టీడీపీని వీడాలని తమను ఎవరూ కూడ భయబ్రాంతులకు గురి చేయలేదన్నారు.

జగన్ విధానాలను సమర్ధిస్తూనే తాను వైసీపీలో చేరినట్టుగా రామసుబ్బారెడ్డి చెప్పారు.మనస్పూర్తిగా టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. సీఎంగా జగన్ తీసుకొన్న నిర్ణయాలు  పేదలకు అనుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉన్న కూడ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను  అమలు చేసేందుకు జగన్ కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios