అమరావతి: ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు ఎమ్మెల్యేలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ నేత సినీనటుడు హరికృష్ణ సంతాప తీర్మానాన్ని పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రవేశపెట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రులు ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు హరికృష్ణకు నివాళులర్పించారు.

అనంతరం టీడీపీ నూతన కార్యాలయ భవన నమూనాను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. పూర్తి స్థాయి గ్రీన్ బిల్డింగ్ గా నూతన టీడీపీ భవనం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా టీడీపీ భవన నిర్మాణం ఉండాలని సూచించారు.

నవంబర్ నెలాఖరులోగా భవనాన్ని పూర్తి చెయ్యాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి టీడీపీ కార్యకలాపాలన్నీ నూతన భవనం నుంచే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నతాజా రాజకీయాలు, గ్రామదర్శిని, గురువారం నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలపై విస్తృత స్థాయి సమావేశంలో చర్చిస్తున్నారు.