ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది. పల్నాడులో టీడీపీ నేత మీద దాడి జరిగింది. కత్తులు, గొడ్డళ్లతో దాడికి దిగారు. మార్నింగ్ వాక్ కు వెడుతున్న వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం చేశారు. 

పల్నాడు : ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నేతలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురిని హతమార్చిన ప్రత్యర్థులు.. తాజాగా రొంపిచర్ల మండల టిడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం చేశారు. అలవల నుంచి చిట్టి పోతుల వారిపాలెం మార్గంలో ఉదయం పూట వాకింగ్ కు వెళుతున్న బాలకోటి రెడ్డిపై కత్తులు, గొడ్డళ్లతో దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో చికిత్స కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలకోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

రొంపిచర్ల ఎంపీపీ భర్త గెడ్డం వెంకట్ రావుతో పాటు ఆయన అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో టిడిపి కార్యకర్తపై హత్యాయత్నం చేశారని.. అప్పుడు దాని మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఈ క్రమంలోనే మరోసారి దాడి జరిగిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే టీడీపీ నేతలకు రక్షణ కరువైందని వారు ఆరోపిస్తున్నారు.

ప్రకాశం, విజయవాడల్లో ఎన్ఐఏ తనిఖీలు: ఆర్ కే భార్య శిరీష, విరసం నేతల ఇళ్లలో సోదాలు

బాలకోటిరెడ్డిపై దాడిని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. వైసిపి కార్యకర్తలు మృగాళ్ల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సామాన్య ప్రజల నుంచి అందరిపైనా వైసిపి దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. తాము కంటికి కన్ను, పంటికి పన్ను పథకం చేస్తే మీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చర్యకు ప్రతిచర్య ఉన్నట్లు ఉంటుందని అచ్చన్న హెచ్చరించారు. 

ఇదిలా ఉండగా, నిరుడు నవంబర్లో గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ టిడిపి నేతపై నడిరోడ్డుపై విచక్షణ రహితంగా దాడి చేశారు కొందరు దుండగులు. బైక్ మీద ఉన్న ఆయనను అడ్డగించి.. భౌతిక దాడికి దిగారు. రహదారి మధ్యలోనే కొందరు ఆయన చేతులు, కాళ్ళు పట్టుకుని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేశారు. మరొకరు ఓ రాయితో తీవ్రంగా దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరొకరు ఒక వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో తరువాత వైరల్ గా మారింది. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ నేత సైదాబిపై ఈ దాడి జరిగింది. ఆయన ఓపెళ్లి వేడుకకు బైక్ మీద వెళ్లి వస్తుండగా కొందరు అడ్డుకున్నారు. ఆయన మీద కర్రలతో రాళ్లతో దాడి చేశారు. సైదాబీ మీద వైసీపీ కార్యకర్తల దాడి చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. పొలానికి సంబంధించి దారి విషయంలోనే వారు కావాలనే తన తండ్రి సైదాబీతో గొడవ పడ్డారని కొడుకు జిలానీ ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన సైదాబీకి నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు.