తనకు బలవంతంగా వైసీపీ కండువా కప్పారని.. తాను ఎప్పటికీ టీడీపీలోనే కొనసాగుతానంటూ ఓ మహిళా నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. పిఠాపురం పట్టణం 14వ వార్డు కౌన్సిలర్ దుగ్గాడ విజయలక్ష్మి గురువారం టీడీపీ నేతల సమక్షంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

తెలుగుదేశం పార్టీలో ఉన్న తనతో మాట్లాడటానికి ఇటీవల వైసీపీ నేత ఒకరు వచ్చారని.. తన అనుమతి కూడా కోరకుండా.. ఆ పార్టీ కండువాను తన మెడలో వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేసిన పనికి తాను షాకయ్యానని ఆమె చెప్పారు.

టీడీపీలో ఉన్న తనకు వైసీపీ జెండా ఎలా వేస్తారని ఆమె ప్రశ్నించారు. ఇలా చేయడం వైసీపీ నేతలకు సమంజసమం కాదని చెప్పారు. తాను ఎప్పటికీ టీడీపీలోనే ఉంటానని.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రజల్లో టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూడలేక వైసీపీ నేతలు ఇలా చేశారని ఆమె ఆరోపించారు.