జగన్ రాసిచ్చిన స్క్రిప్టుని ఆమంచి కృష్ణమోహన్ చదివి వినిపించారని టీడీపీ మహిళా నేత అనురాధ అభిప్రాయపడ్డారు.
జగన్ రాసిచ్చిన స్క్రిప్టుని ఆమంచి కృష్ణమోహన్ చదివి వినిపించారని టీడీపీ మహిళా నేత అనురాధ అభిప్రాయపడ్డారు. ఆమంచి బుధవారం టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా.. వైసీపీలో చేరిన వెంటనే.. టీడీపీ, చంద్రబాబుపై ఆమంచి విమర్శల వర్షం కురిపించారు. ఆమంచి కామెంట్స్ పై తాజాగా అనురాధ స్పందించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

వైసీపీ అధ్యక్షుడు జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం దురదృష్టకరమని అన్నారు. సీఎం సహాయనిధి నుంచి చీరాలలో 1000 మందికి రూ.6.11 కోట్లు ఇచ్చారని అన్నారు. వారందరిది ఏ కులం? అని అనురాధ ప్రశ్నించారు. చీరాలలో జరిగిన అభివృద్ధిని ఆమంచి ప్రస్తావించకపోవడం దారుణమన్నారు.
ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే వైసీపీ నిరసన తెలపకపోగా స్వాగత బ్యానర్లు కట్టారని ఆమె విమర్శించారు. జగన్ కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని అనురాధ ఆరోపించారు.
