సంచలనం: ఈవీఎంల పనితీరుపై అనుమానాలు, ట్యాంపరింగ్‌కు ఛాన్స్: బాబు

సంచలనం: ఈవీఎంల పనితీరుపై అనుమానాలు, ట్యాంపరింగ్‌కు  ఛాన్స్: బాబు


అమరావతి: ఈవీఎంల పనితీరుపై పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. ఈవీఎంలతో సహా ఏ ఎలక్ట్రానిక్ వస్తువునైనా  సులభంగా దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదని టిడిపి చీప్ చంద్రబాబునాయుడు కూడ అభిప్రాయపడ్డారు.ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాన్ని సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

మంగళవారం నాడు అమరావతిలోని ప్రజా దర్భార్ హల్ లో జరిగిన టిడిపి సమన్వయ కమిటి సమావేశంలో ఈవీఎంల  అంశంపై చర్చ జరిగింది.ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు  ఈవీఎంల పనితీరును గురించి ప్రస్తావించారు. 


ఈవీఎంల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన ఈ సమావేశంలో చెప్పారు.ఈవీఎంలపై పార్టీ నాయకులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల సంఘం సహా అన్ని రకాల వ్యవస్థలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకొంటుందని యనమల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలతో చంద్రబాబునాయుడు కూడ ఏకీభవించారు. యనమల వ్యాఖ్యలు చాలా కీలకమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవీఎంలతో పాటు ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్నైనా దుర్వినియోగం చేసే అవకాశం సులభంగా ఉంటుందని ఆయన చెప్పారు. 

అయితే ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యామ్నాయాన్ని కూడ సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కూడ అనేక అనుమానాలు వ్యక్తమైన సందర్భంలో  మరోసారి ఈ విషయమై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.


రాష్ట్రంలో సుమారు 55 వేల బూత్ కమిటీలను ఏర్పాటు చేసినట్టు సమావేశంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. బూత్ కమిటీ సభ్యుల సమన్వయం కోసం సెల్‌ఫోన్లను కూడ సమకూరుస్తున్నట్టు ఆయన చెప్పారు. బూత్ పరిధిలోని ఓటరు జాబితాలపై పార్టీ నేతలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page