నంద్యాల్లో టీడీపీ కౌన్సలర్లు ధర్నా. మున్సిపల్ హాల్ ఎదురుగా బైటాయించారు. ఛైర్ పర్సన్ సులోచన పదవి విరమణ చేయాలని డిమాండ్. 

నంద్యాల్లో టీడీపీ నేతలు ఆందోళ‌నకు దిగారు. నంద్యాల మున్సిపల్ కార్పోరేష‌న్ ఎదుట ధ‌ర్నా చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఆ పార్టీ కౌన్సిలర్లు బహిష్కరించారు. కార‌ణం టీడీపీ త‌రుపున గెలిచిన ఛైర్‌ప‌ర్స‌న్ సులోచ‌న‌ వైసీపీలోకి పిరాయించార‌ట‌. 

ఇదేవిష‌యంపై టీడీపీ కౌన్సిలర్ విజయకుమార్ మాట్లాడుతూ పార్టీని భ్రష్టుపట్టించిన సులోచ‌న త‌క్ష‌ణ‌మే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆమె అవినీతిలో కోట్ల రూపాయ‌లు సంపాధించారని ఆయ‌న ఆరోపించారు. ఫోరం లేకుండా ఆమె సీట్లో కూర్చోవడం బాధాకరమని ఆయన అన్నారు.

మరిన్ని తాజా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి