Asianet News TeluguAsianet News Telugu

పింఛన్ల పంపిణీలో తెలుగు తమ్ముళ్ల రికార్డింగ్ డ్యాన్స్ లు

వాకాడ అనే గ్రామంలో పింఛన్ల పండుగ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు రికార్డింగ్ డ్యాన్స్ పెట్టించారు. గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను, గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు అంటూ యువతలు వేసిన చిందెలతో సభకు వచ్చిన మహిళలు ఇబ్బంది పడ్డారు. 

TDP leaders recording dances in pension distribution prgrammes
Author
Vakada, First Published Feb 5, 2019, 4:37 PM IST

వాకాడ: మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత ఏసీ సీఎం చంద్రబాబు నాయుబు నానా పాట్లు పడుతుంటే అందుకు సహకరించాల్సిన తెలుగుతమ్ముళ్లు అపహాస్యం చేసేలా ప్రకవర్తిస్తున్నారు. 

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు వృద్ధాప్య పింఛన్ రూ.2000, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద రూ.10 వేలు ఇస్తూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. 

పింఛన్ పెంపుకు సంబంధించి పింఛన్ల పండుగ చెయ్యాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పసుపు కుంకుమ పథకాన్ని ఒక బృహత్తర కార్యక్రమంలా ప్రచారం కల్పించాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. 

అందులో భాగంగా బహిరంగ సభలు పెట్టి మరీ చెక్కులు పంపిణీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆడపడుచుల పార్టీ అంటూ చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు మహిళలకు పెద్దన్న అంటూ టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. 

ఇంతలా టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే కొంతమంది తెలుగుతమ్ముళ్లు మాత్రం అపహాస్యం చేస్తున్నారు. పింఛన్ల పండుగలో రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేసి ఆ పవిత్రతను కాస్త అపహాస్యం చేస్తున్నారు. 

వాకాడ అనే గ్రామంలో పింఛన్ల పండుగ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు రికార్డింగ్ డ్యాన్స్ పెట్టించారు. గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను, గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు అంటూ యువతలు వేసిన చిందెలతో సభకు వచ్చిన మహిళలు ఇబ్బంది పడ్డారు. 

ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు ఉండే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఒకవైపు మహిళలు అంటే ఎంతోగౌరవం అని మహిళలకు తాము పెద్ద పీట వేస్తున్నట్లు చెప్తున్న చంద్రబాబు నాయుడు  ఈ కార్యక్రమంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios