ఆయనో పెద్ద క్రిమినల్ ... వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును బర్తరఫ్ చేయండి: గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు

ఇటీవల మాజీ డ్రైవర్ హత్య కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో వున్న అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ  ఫిర్యాదు చేసింది. ఆయనకు గతంలో నేర చరిత్ర వుందని తెలుగుదేశం నేతలు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 
 

tdp leaders meets ap governor biswabhusan harichandan over ysrcp mlc ananthababu issue

ఇటీవల మాజీ డ్రైవర్ హత్య కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో వున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును (ysrcp mlc ananthababu) పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా టీడీపీ (tdp) నేతలు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను (governor biswabhusan harichandan) కోరారు. మంగళవారం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (nakka anand babu) ఆధ్వర్యంలో టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. అనంతరం ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ..  ఆనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుండి భర్తరఫ్ చేయాలి అని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.  గిరిజన ప్రాంతంలో ఆనంతబాబు చేసిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి అని కోరినట్లు ఆనందబాబు  వెల్లడించారు. 

ఫేక్ సర్టిఫికెట్‌లు పెట్టుకుని ఆనంతబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నేర చరిత్ర వుందని.. బోగస్ సర్టిఫికేట్లతో పదవులను అనుభవించాడని ఆనందబాబు పేర్కొన్నారు. గిరిజనుల హక్కులను అనంతబాబు కాలరాస్తున్నాడని.. ఇలాంటి నేరస్తులకు పదవులను ఇవ్వటం వైసీపీ ప్రభుత్వానికి అలవాటు అయిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. గంజాయి, కలప దోచేసిన దొంగ ఆనంతబాబు పెద్ద క్రిమినల్ అని నక్కా ఆనందబాబు ఆరోపించారు. 

ALso Read:డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు

జైల్లో ఆనంతబాబుకి రాచమర్యాదలు చేస్తున్నారని.. కస్టడీ పిటిషన్ వేసి ఆనంతబాబుని పోలీసులు ఎందుకు విచారించలేదని ఆయన ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని.. ఆనంతబాబు సమాజంలో ఉండటానికి అనర్హుడని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. శాసనమండలి సభ్యునిగా బర్తరఫ్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మరణానికి కారణమైన ఎమ్మెల్సీపై వెంటనే గవర్నర్ సీబీఐ విచారణ చేయించాలని నక్కా ఆనందబాబు కోరారు. 

MLC అనంతబాబును తన వద్ద పనిచేసిన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఈ ఏడాది మే 23న అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్సీకి మేజిస్ట్రేట్ 14 రోజుల పాటు Remand విధించారు. అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను కస్టడీ తీసుకొనేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదు. రిమాండ్ గడువు పూర్తి కావడంతో సోమవారం మరోసారి ఆన్ లైన్‌లో జడ్జి ముందు పోలీసులు ఎమ్మెల్సీని ప్రవేశ పెట్టారు. దీంతో ఈ నెల 20వ తేదీ వరకు ఎమ్మెల్సీకి రిమాండ్ ను పొడిగించారు జడ్జి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios