సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వివాదాలకు ఆర్జీవీ కేరాఫ్ అడ్రస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. 

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వివాదాలకు ఆర్జీవీ కేరాఫ్ అడ్రస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన తీసే సినిమాల దగ్గర నుంచి.. ఆయన ట్విట్టర్ లో చేసే కామెంట్స్ వరకు అన్నీ వివాదాస్పదంగానే ఉంటాయి. తాజాగా ఆయన తన ట్విట్టర్ కామెంట్స్ లో డోస్ మరింత పెంచారు.

టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లుగా ఫోటో మార్ఫింగ్ చేసి ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బాచుపల్లిలోని కౌసల్యకాలనీకి చెందిన తెలుగుదేశం అభిమాని దేవీబాబు చౌదరి బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆర్జీవీ పై ఫిర్యాదు చేశారు.

 ఫోటో మార్ఫింగ్ చేసినందుకు ఆర్జీవీపై కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు. లక్ష్మీస్‌ ఎన్టీయార్‌ సినిమాపై న్యాయస్థానంలో కేసు వేసి ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకుండా చేసింది కూడా తానేనని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Scroll to load tweet…