Asianet News TeluguAsianet News Telugu

గతంలో వ్యతిరేకించి.. ఇప్పుడు అనుమతులు.. వైసీపీపై యనమల ఫైర్..

కోన ప్రాంత ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే  రసాయన పరిశ్రమలను తాను వ్యతిరేకిస్తున్నానని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రకటించారు.  ఇప్పటికే ఏర్పాటైన దివీస్ కెమికల్ ఇండస్ట్రీతో సహానే రసాయన పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. 

tdp leader yanamala ramakrishnudu fires on ycp govt over chemical factories - bsb
Author
Hyderabad, First Published Dec 10, 2020, 9:57 AM IST

కోన ప్రాంత ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే  రసాయన పరిశ్రమలను తాను వ్యతిరేకిస్తున్నానని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రకటించారు.  ఇప్పటికే ఏర్పాటైన దివీస్ కెమికల్ ఇండస్ట్రీతో సహానే రసాయన పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. 

గతంలో వైసీపీ కూడా ఈ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా.. దీనిని వ్యతిరేకించినట్లు నటించింది. ఆ తరువాత అధికారంలోకి రాగానే దివీస్ కెమికల్ ఇండస్ట్రీ ఏర్పాటుకు వైసిపి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ద్వారా ఇప్పుడా పార్టీ అసలు రంగు బైటపడిందని యనమల మండిపడ్డారు. 

ఈ రసాయన పరిశ్రమ ఏర్పాటు వల్ల సముద్రజలాలు కలుషితమై మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారు, భూములంతా ఉప్పు తేలడంతో రైతులకు ఎనలేని నష్టం వాటిల్లుతుంది. 300పైగా హేచరీస్ కూడా కాలుష్యంలో చిక్కుకుని చిరు వ్యాపారులంతా పూర్తిగా దెబ్బతింటారు. 

దీనితో వాళ్ల నిజ ఆదాయాలు క్షీణించడమే కాకుండా ప్రభుత్వ రాబడికూడా పడిపోతుంది.   
సముద్రజలాలన్నీ కలుషితమై, అసలు చేపల వేట కార్యక్రమాలే లేకపోతే ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదన అంతా దారుణ మోసమే..ఇక్కడ బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటును కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 

కాకినాడ సెజ్ లో 51% షేర్లను రూ 2,511కోట్లకు ఇప్పటికే కొనుగోలు చేసిన జగన్ బినామీలు బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా కోన ప్రాంతంలో గ్రామాలను కబ్జా చేసి, తీరప్రాంతాన్ని ఆక్రమించి తమ ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్థాపనకు చేస్తున్న ప్రయత్నాలను గర్హిస్తున్నాం.
ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. 

రసాయన పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలను తక్షణమే జగన్ రెడ్డి ప్రభుత్వం విరమించుకోవాలి. లేనిపక్షంలో ఉత్పన్నం అయ్యే దుష్పరిణామాలకు జగన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios