వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు కేంద్రంగా విమర్శలు సంధించారు. విద్యార్థులు, పేరెంట్స్‌లో మనోధైర్యం కల్పించలేదని, కానీ, ఆ పని చేయడానికి నారా లోకేశ్ ముందుకు వచ్చారని, జూమ్ కాల్ ద్వారా వారిని పరిస్థితులకు సిద్ధం చేస్తూంటే వైసీపీ నేతలు ఎందుకు చొరబడ్డారని ప్రశ్నించారు.
అమరావతి: పదో తరగతి పరీక్ష ఫలితాల నేపథ్యంలో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు సంధించారు. జగన్‌మోహన్ రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదని, ఆయన ఒక సైకోలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. జగన్ ఒక మూర్ఖుడని, ఆర్థిక నేరస్థుడని విమర్శించారు. జగన్ పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహించారు. ఇందుకు పదో తరగతి ఫలితాలే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను రాజకీయంగా వాడుకున్నారని ఆరోపించారు. నాడు నేడు పథకం ద్వారా బడులకు ద్వారా బడులకు వైసీపీ రంగులేయడానికి బదులు విద్యార్థులకు మంచి విద్యను చూపించడంపై శ్రద్ధ పెడితే విద్యా వ్యవస్థ బాగుపడేదని ఆమె అన్నారు.
2011 నుంచి పదో తరగతి పరీక్షల్లో 85 శాతం ఉత్తీర్ణత వచ్చిందని, 2019 వరకు కూడా 94 శాతం పాస్ పర్సెంటేజీ వచ్చిందని అన్నారు. ఈ ఫలితాలు చూసి విద్యా శాఖ గర్వంగా ఫీల్ అయ్యేది కూడా అని, ఐఏఎస్ అధికారుల సలహాలను కూడా జగన్ తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారని అన్నారు. పదో తరగతి విద్యార్థులను తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రద్ధగా చూసుకుంటారని, కానీ, ప్రభుత్వం వారి ఆశలను అడియాశలు చేసిందని ఆరోపించారు. కరోనాతో రెండేళ్లు చదువు లేకుండాపోయిన సందర్భంగా పరిస్థితులకు తగినట్టుగా మార్పులు తీసుకు రావాల్సిందిపోయి విద్యార్థులపైనే ఒత్తిడి తెచ్చారని వాదించారు. విద్యార్థుల తల్లిదండ్రులనూ మానసికంగా ఒత్తిడి చేశారని, ఐదు నెలల్లో సిలబస్ కంప్లీట్ చేయాలని ఉపాధ్యాయులకూ టార్గెట్లు పెట్టడం దారుణం అని చెప్పారు.
విద్యార్థులు, తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపడానికి ముందుకు వచ్చి జూమ్ కాల్‌లో ముఖాముఖి జరుపుతుంటే.. అందులో సన్నాలకు పండుగ ఏమిటి? అని అన్నారు. జూమ్ కాల్‌ను అడ్డుపడటం తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ అని విజయసాయి రెడ్డి తెలిపారని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధ పదవులు అనుభవించిన మాజీ మంత్రి కొడాలి నాని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీయడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు. విజయసాయితో చర్చకు లోకేశ్ ఎందుకు? తాను చాలు అని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు ప్రారంభించిన ఆఫీసులోనైనా సరే.. తనతో చర్చించాలని చాలెంజ్ చేశారు. జగన్ నత్తినత్తిగా మాట్లాడుతారని విజయసాయి చర్చకు సిద్ధమయ్యాడా? అని ఎద్దేవా చేశారు. కొడాాలి నానీ, వల్లభనేని వంశి వెకిలి చేష్టలు చేయకుంటే విద్యార్థుల సమస్య జగన్ వద్దకు వెళ్లేదేమో అని అన్నారు. అలా వెళ్లకుండా చేశారని పేర్కొన్నారు. 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఇప్పుడు ఏ అధికారి సమాధానం చెబుతాడని నిలదీశారు. పదవ తరగతి పరీక్ష పాట్రాన్ మార్చారని, బిట్ పేపర్ తీసేశారని, చాయిస్ తక్కువగా ఇచ్చారని, అసలు పేపర్ మోడలే తెలుపలేదని అన్నారు. వీటిపై విద్యార్థులకు అవగాహన కలిగించకపోవడమే కాదు.. పేపర్ లీక్ అంటూ గందరగోళం సృష్టించారని తెలిపారు. పదో తరగతి తప్పిన విద్యార్థులకు 5 గ్రేస్ మార్కులు ఇవ్వాలని టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు వంగలపూడి అని అన్నారు. ఇలా చేస్తే ఒక లక్ష మంది దాకా పాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.
