Asianet News TeluguAsianet News Telugu

మహిళల ఉసురు తగులుతుంది: జగన్‌ ప్రభుత్వంపై అనిత ఫైర్

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మహిళల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వ తీరు చూస్తే మాటలు కోటలు దాటుతున్నాయ్, చేతలు ఇంటి గుమ్మం కూడా దాటట్లేదని సెటైర్లు వేశారు

tdp leader vangalapudi anitha fires on ys jagan govt over dwakra loans
Author
Amaravathi, First Published Apr 23, 2020, 4:15 PM IST

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మహిళల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వ తీరు చూస్తే మాటలు కోటలు దాటుతున్నాయ్, చేతలు ఇంటి గుమ్మం కూడా దాటట్లేదని సెటైర్లు వేశారు.

నవరత్రాలు పేరుతో మోసం చేసి వైసీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయ్యిందని.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్టుండి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి మహిళలు గుర్తొచ్చారని అనిత వ్యాఖ్యానించారు.

Also Read:వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. అసలు వాస్తవం ఇదే..!!

 వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి డ్వాక్రా మహిళల రూ. 2,500  కోట్ల రూపాయలు రుణాలకు సంబంధించిన వడ్డీని రీయింబర్స్ మెంట్ చేయాల్సి ఉందని ఆమె అన్నారు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందనడం సరికాదని, డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఇది నిరంతర ప్రక్రియ అని అనిత చెప్పారు.

ఏ ప్రభుత్వానికైనా గత ప్రభుత్వ డ్వాక్రా బకాయిలు ఉంటాయని... అలాగే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయడంతో పాటు ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ. 75 వేలు ఇస్తామని జగన్ ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదన్నారు.

డ్వాక్రా మహిళలను ఆదుకుంటామని  పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి రకరకాల విన్యాసాలు చేశారని అనిత మండిపడ్డారు. మహిళల నుదిటిపై ముద్దులు పెట్టి ప్రగల్భాలు పలికారని, మహిళలకు సినిమా చూపించారని ఆమె వ్యాఖ్యానించారు.

డ్వాక్రాలో ఒక మహిళ ఉండటమంటే ఆర్థిక భరోసా. కుటుంబానికి ఆసరా అని మాయమాటలతో వారితో ఓట్లేంచుకుని కనీసం మొదటి విడత రుణమాఫీ గురించి కూడా నేటికీ మాట్లాడకపోవడం ఎంతవరకు న్యాయమని అనిత ప్రశ్నించారు.

45 సంవత్సరాలు దాటిన మహిళకు పెన్షన్ ఇస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ఆమె నిలదీశారు. తెలుగుదేశం హయాంలో ఐదు లక్షల వరకు రుణం తీసుకున్న వారికి సున్నా వడ్డీ ఇచ్చామని, ఆ వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించిందని అనిత గుర్తుచేశారు.

ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఏడు లక్షల యాభైవేలు కటాఫ్ పెడతానని చెప్పారని, అధికారంలోకి వచ్చాక మాట మార్చి కేవలం మూడు లక్షల వరకు రుణం తీసుకున్నవారికి మాత్రమే వడ్డీ చెల్లిస్తామంటున్నారని తెలిపారు.

వైసీపీ మోసాన్ని మహిళలు అర్ధం చేసుకోవాలని, లాక్‌డౌన్ సమయంలో కూలీ పనులకు వెళ్లలేక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వాయిదాలేమీ చెల్లింకర్లేదని, కానీ వడ్డీలన్నీ మీరే చెల్లించాలని బ్యాంకర్లు చెబుతున్నారని అనిత అన్నారు.

Also Read:మాస్క్ పెట్టుకోండి.. ఫ్యూచర్‌లో నేను గొడవ పడాలిగా: విజయసాయిపై నాగబాబు సెటైర్లు

దయచేసి డ్వాక్రా మహిళలకు ఆ మూడు నెలల వడ్డీ కూడా రాయితీ ఇవ్వాలని.. ఆర్‌వోలకు సంవత్సరం నుంచి జీతాలు లేవని అనిత చెప్పారు. పది వేల రూపాయల జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి ఓటేంచుకున్నారని, ఇదేనా మాట తప్పడు మడమ తిప్పడు అంటే ? దళిత మహిళలను కూడా ఆదుకోవాలన్నారు.

పనికి రాని స్కీములు పెట్టి ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని, ఇంత జరుగుతుంటే ఈ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్లని అనిత ప్రశ్నించారు. కరోనాతో జనం బిక్కుబిక్కుమంటుంటే ఎమ్మెల్యే రోజా పూలు చల్లించుకోవడం ఏంటి, అసలావిడకు ఆ ఆలోచన ఎలా వచ్చిందోనని నిలదీశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios