మద్య నిషేధం మేనిఫెస్టోలో లేదంటారా .. అదో చెత్త కాగితం: గుడివాడ అమర్‌నాథ్‌కు వంగలపూడి అనిత చురకలు

మద్యపాన నిషేధం చేస్తామని తాము మేనిఫెస్టోలో చెప్పలేదన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. వైసీపీ పాలనలో మద్యపాన నిషేధం లేదని అనకాపల్లిలో ప్రజా సభలో బహిరంగంగా చెప్పగలరా అని అనిత సవాల్ విసిరారు. 

tdp leader vangalapudi anitha challenge to minister gudivada amarnath on liquor ban

వైసీపీ మేనిఫెస్టోలో (ysrcp manifesto) మద్యపాన నిషేధం (liquor ban) గురించి లేదన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (gudivada amarnath) వ్యాఖ్యలపై స్పందించారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (vangalapudi anitha) . ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.... తమ పార్టీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదని మంత్రి నిస్సిగ్గుగా చెబుతున్నాడని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో మద్యపాన నిషేధం లేదని అనకాపల్లిలో ప్రజా సభలో బహిరంగంగా చెప్పగలరా అని అనిత సవాల్ విసిరారు. 

వైసిపి మేనిఫెస్టోలో ఉన్న విషయాలు అన్ని అబద్ధాలని అందుకే ఇది ఒక చెత్త కాగితమని ఆమె ఫైరయ్యారు. ఈ మేరకు ఆమె వైసీపీ మేనిఫెస్టో తగులబెట్టారు. టిడిపి హయాంలో లిక్కర్ ఆదాయం మీద ఆధారపడలేదని.. లిక్కర్ ఆదాయం పై ఆధారపడి పధకాలు ఇవ్వలేదని అనిత గుర్తుచేశారు. అప్పుడు ఏడాదికి మద్యం ఆదాయం ఆరు వేలు మాత్రమేనన్న ఆమె.. ఇప్పుడు అంతకు మూడు ఇంతలు పెరిగిందని ఆరోపించారు. నాటు సారా తయారు చేస్తున్న వారిపై పిడి యాక్ట్ పెడుతున్నారని... మద్యానికి టార్గెట్ పెట్టి మరి అమ్ముతున్నారని అనిత అన్నారు. 

ALso REad:మద్యపాన నిషేధం చేస్తామని మేం చెప్పామా : మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు

అంతకుముందు మద్యపాన నిషేధం వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను నిలదీయడానికి టిడిపి కార్యాలయం నుంచి బయలుదేరిన వంగలపూడి అనిత, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఎదుట వైసీపీ పార్టీ మేనిఫెస్టోను చింపేసి నిరసన వ్యక్తం చేశారు. 

కాగా.. ఏపీలో మద్యపాన నిషేధానికి సంబంధించి వైసీపీ నేత (ysrcp), మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (gudivada amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధం అన్న మాటే తమ మేనిఫెస్టోలో లేదన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో మద్యం ధరలను క్రమంగా పెంచుతున్న వైనంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలను ఫైవ్ స్టార్ హోటల్ రేట్లకు తీసుకెళ్తామని మాత్రమే చెప్పామని గుడివాడ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మద్యం తాగాలంటే వారికి షాక్ కొట్టేలా చేస్తామనే తాము అన్నామని.. అందులో భాగంగానే మద్యం ధరలపై తాము ఇప్పుడు చేస్తున్నామన్నారు. 

ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ లభిస్తున్న పలు మద్యం బ్రాండ్లలో విషపూరిత రసాయనాల, మోతాదుకు మించి రసాయనాలు వాడుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి మద్యం తాగడం వల్ల మతిభ్రమించడం, నరాలు లాగేయడం, మెదడుతో పాటు నరాల్లో సూదులు గుచ్చినట్లు ఇలా వింత రోగాల భారినపడే అవకాశాలున్నాయని టిడిపి నాయకులు ఇటీవల ఆరోపించారు. ఈ ప్రచారంపై లిక్కర్ తయారీదారుల అసోసియేషన్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios